calender_icon.png 27 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు

26-04-2025 10:35:30 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): అంత్యక్రియలకు వచ్చి వ్యక్తి మృత్యువాత పడ్డ ఘటనతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గండ్రకోట రాజశేఖర్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. హుస్నాబాద్ కు చెందిన ఇస్లావత్ వెంకట్(40), రాజశేఖర్ అంత్యక్రియలకు శనివారం వచ్చాడు. ప్రతాప్ వాడలోని రాజశేఖర్ ఇంటి సమీపంలోని మురుగు కాలువలో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోగా మార్గమధ్యలో  మృతి చెందాడు. మృతుడికి  భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.