భూపాలపల్లి కలెక్టర్ ఆహ్వాన కార్డు
జయశంకర్ భూపాలపల్లి, మే11 (విజయక్రాంతి): 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ భారత ప్రజాస్వామ్య పండుగకి హాజరు కావాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ముద్రించిన ఆహ్వాన కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత ప్రజాస్వామ్య లోక్‌సభ సాధారణ ఎన్నికలకు మీ కుటుంబంలో అర్హులైన ఓటర్లందరినీ ఆహ్వానిస్తున్నామని అందులో పేర్కొన్నారు. పోలింగ్ తేదీ 13 సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, మీ పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళాలని, 5 సంవత్సరాల పాటు శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో అన్ని ఫలాలు అందుకోవచ్చని ఆహ్వాన కార్డుల్లో ముద్రించారు. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ వెంట ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని కోరారు.