08-04-2025 12:42:31 AM
డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఓయూ వీసీ ప్రొ.కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10 నిర్వహించబోయే మహాత్మా జ్యో తిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగారం ఆహ్వానించారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉద్యోగావకాశాలున్న నూతన కోర్సులను రూపొందించాలని భట్టి విక్ర మార్క సూచించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొ.లావణ్య, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.శ్రీనగేష్, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.