05-04-2025 01:07:35 AM
రాజేంద్రనగర్ డిసిపి, పోలీసు అధికారులకు ఆహ్వానం
రాజేంద్రనగర్ ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): మహనీయుల జయంతి ఉత్సవాలకు రావాలని ఉత్సవ కమిటీ సభ్యులు రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తో పాటు ఇతర పోలీసు అధికారులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ ప్రాంతంలో డా‘బాబు జాగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం నిర్వహణ కోసం రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అనుమతి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో, నాగేశ్వరరావు నరేందర్, రాజేందర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలకు రావాలని ఈ సందర్భంగా వారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తో కలిసి సభ స్థలిని పరిశీలించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు ఎడ్లకాడి సూర్యం, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, కోశాధికారి మంగళారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.