calender_icon.png 26 December, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిల భారత సాంస్కృతిక ఉత్సవాలకు రండి

03-11-2024 12:16:25 AM

చిరంజీవిని ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మధ్యాహ్నం చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి.. ఆయనకు పుష్ఫగుచ్ఛం ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు.

అనంతరం అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా చిరంజీవిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవం అని చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జానపద, గిరిజన కళలు, సంగీతం, వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటి ఉన్నతమైన వేదికలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగనున్న అఖిల భారత సాంస్కృతిక ఉత్సవాలకు ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది. ఇదిలా ఉండగా, చిరంజీవిని కలిసిన విషయాన్ని కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలామందికి స్ఫూర్తినిచ్చారని, అలాంటి వారిని కలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని ఈ పోస్ట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాసుకొచ్చారు.