వికారాబాద్, సెప్టెంబర్‌౫ (విజయక్రాంతి) : బొజ్జ గణపయ్య వీధి వీధినా కొలువుదీరే సమయం ఆసన్నమైంది. భక్తులను ఆశీర్వదించి.. అనుగ్రహించే ఘడియలు అరుదించాయి.. శనివారం నుంచి గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే ఉత్సవ కమిటీ నిర్వాహకులు సుమారు 5 వేల గణపతి విగ్ర హాలను ప్రతిష్ఠించనున్నారు. 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔత్సాహిక ఉత్సవ కమిటీలు స్థానికంగానే కాక పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భారీ విగ్రహాలు తీసుకొస్తు న్నారు. అలాగే విగ్రహాలకు డిమాండ్ పెరగడంతో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లోని తయారీదారుల పంట పండినట్లయింది.
ఆయా కుటుంబాలు నాలుగు దశాబ్దాల నుంచి విగ్రహాలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పిల్లాపాప ఏడదంతా కష్టపడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. రెండేళ్ల పాటు కరోనా సంక్షోభంలో ఆర్థికంగా నష్టపోయిన తయారీదారులు గతేడాది కొంత ఆర్థికంగా ఊరట పొందారు. ఈసారైనా వారు కష్టాల నుంచి బయటపడాలని వారు ఆశపడుతున్నారు. మమల్ని ఆదుకోవాలని బొజ్జ గనపయ్యను తయారీదారులు వేడుకుంటున్నారు.