calender_icon.png 17 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూయార్క్‌లో బోనాలకు రండి

17-01-2025 02:06:38 AM

మంత్రి సీతక్కకు నైటా ఆహ్వానం

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్‌లో తెలుగువారికి ఓ సంఘం ఏర్పాటు చేయటంతోపాటు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగించేందుకు నైటా (న్యూ యార్క్ తెలంగాణ తెలుగు సంఘం) చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో సీతక్కను నైటా నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసింది.

నైటా నూతన అధ్యక్షురాలిగా ఎంపికైన వాణి ఏనుగుకు ఈ సందర్భంగా మంత్రి శుభా కాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచి, నైటా సేవలను మరింత విసృతం చేయాలని మంత్రి సూచించారు. జూన్‌లో న్యూయార్క్‌లో నిర్వ హించే బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రిని నైటా కార్యవర్గం ఆహ్వానించింది. ఇం దుకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు కార్యవర్గం పేర్కొన్నది.