టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అక్టోబర్ 19న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.
జూబ్లిహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. దేవీశ్రీ వెంట బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా లైవ్ షోలను ఇస్తానని దేవి ఇంతకు ముందే ప్రకటించారు. దీనిని ముందుగా హైదరాబాద్ నుంచి మొదలు పెడతానని వెల్లడించారు. దీనిలో భాగంగానే 19న మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.