14-04-2025 12:00:00 AM
- మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కడ్తాల్, ఏప్రిల్ 13: వరంగల్ లో జరుగ రజోత్సవ సభకు భారీగా ప్రజలు తరలి రావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమావేశం అదివారం కడ్తాల్ మండల కేంద్రంలో జైపాల్ యాదవ్ నివాసంలో నిర్వహించారు.
సమావేశంలో జైపాల్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 వ సంవత్సరంలోకి అడుగు గితున్న సందర్భంగా వరంగల్ పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఈ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ప్రజలు కదిలి రావాలని రావాలని కోరారు. కోరారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంను చూసిన ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొ న్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీ లను ఒక్కటి నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని ప్ర జల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నా రు. హైదరాబాదు నడిబొడ్డున హెచ్ యుసి భూములు, విషయంలో అక్కడున్న వన్యప్రాణుల ప్రాణాలు తీసి బుల్డోజర్లతో అడవి నీ ధ్వంసం చేసిన ఘటన ప్రజలు మర్చిపో లేదని, అంతేకాకుండా రైతుబంధు, అరకొరగా జమ చేసి రైతుల రైతుల నడ్డి విరిచారని విమర్శించారు.
ఆరుగ్యారెంటీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేని అసమర్థ పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందనిసమావేశానికి హాజరైన బీఆర్‌ఎస్ శ్రేణులు అన్నారు. బిఆర్‌ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగరవేసేం దుకు కార్యకర్తలు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమా వేశంలో మాజీ జడ్పిటిసిలు దశరథ్ నాయక్, విజిత రెడ్డి, మాజీ సర్పంచి లక్ష్మి నర్సింహారెడ్డి, సింగల్ విండో చైర్మన్ వెంకటేష్, అర్జున్ రావు, వీరయ్య, మండల అధ్యక్షుడు పరమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.