calender_icon.png 23 September, 2024 | 2:00 PM

రా అమ్మా.. నాకు భయమేస్తుంది !

06-09-2024 01:14:47 AM

  1. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన మహిళ 
  2. అమ్మ, సోదరి, సోదరుడి కోసం ఒడ్డున ఏడ్చిన చిన్నారి 
  3. ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన పోలీసులు 
  4. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి)/ ఇబ్ర హీంపట్నం: ‘అమ్మా నాకు భయమేస్తుంది. అక్కా అన్నయ్య, నువ్వు ఎందుకు చెరువులో దూకారు. మీరు నాకు కనిపించడం లేదు. చీకటవుతుంది. నేను ఒక్కడినే ఉన్నాను. అమ్మా.. రా.. ’ అని ఓ ఆరేళ్ల బాలుడు ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గుక్క పెట్టి ఏడుస్తు న్నాడు. అప్పుడు సమయం రాత్రి 7.15 గంటలు. బాలుడి ఏడుపు గమనించిన స్థానికులు, బాటసారులు ఏమైందని అడుగగా.. ‘మా అమ్మ, అక్క, అన్నయ్య చెరువులో దూకిండ్రు’ అంటూ బోరున విలపించాడు. ఈ హృదయవిదారక ఘటన ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసింది.

పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్‌లో ఓర్సు మంగ (38), భర్త కుమార్ దంపతులు ముగ్గురు పిల్లలు లావ ణ్య (14), శరత్ (9), విఘ్నేష్ (6)తో కలిసి నివసిస్తున్నారు. ముగ్గురు పిల్లలు వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్‌లో చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తన పిల్లలను వెంట బెట్టుకొని తల్లి ఇబ్రహీంపట్నం చెరువు వద్ద కు వచ్చింది. మంగకు ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ.. బిడ్డ లావణ్య, కొడుకులు శరత్‌ను నీళ్లలో తోసి తాను ఆదే చెరువులో దూకింది. అమ్మ, అక్క, అన్నయ్య నీళ్లలో నుండి వస్తారనుకుని ఆ ఆరు సంవత్సరాల విఘ్నేష్‌ను చెరువు ఒడ్డున నిలబడి ఎదురుచూస్తున్నాడు.

చీకటిపడుతున్నా వాళ్లు రాక పోవడంతో ఏడుస్తూ భయంతో రోడ్డు వర కు పరుగుతీసి స్థానికులు, బాటసారులకు విషయం తెలిపాడు. వెంటనే జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. హు టాహుటిన చెరువు వద్దకు వచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలించి మంగ, శరత్ మృతదేహాలను వెలికి తీశారు. లావణ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. మంగ భర్త కుమార్ ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? అసలు కుటుంబంతో ఉంటున్నాడా లేదా అనేది మాత్రం పోలీసు లు ధ్రువీకరించ లేదు. ముగ్గురి మృతిపై వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.