calender_icon.png 28 September, 2024 | 8:56 PM

రా మచ్చా మచ్చా..

26-09-2024 12:48:37 AM

హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మేకర్స్ తాజాగా మూవీ నుంచి అప్‌డేట్ ఇచ్చారు. సె

ప్టెంబర్ 28న  మూవీలోని నుంచి సెకండ్ సింగిల్‌గా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమోను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ తిరుణావుక్కరసు; మ్యూజిక్: తమన్; మాటలు: సాయిమాధవ్ బుర్రా; పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్; యాక్షన్ కొరియో గ్రఫీ: అన్బరివు; డాన్స్ కొరియోగ్రఫీ: ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ; ఎడిటర్: షామీర్ ముహ్మద్.