calender_icon.png 27 December, 2024 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాటుగా మాట్లాడుకుందాం రా!

31-10-2024 12:04:37 AM

యువతిపై లైంగికదాడికి ప్రభుత్వ హెచ్‌ఎం యత్నం

అచ్చంపేట, అక్టోబర్ 30: చాటుగా మాట్లాడుకుందామంటూ ఓ హెచ్‌ఎం ఒంటరిగా ఉన్న ఓ యువతికి సెల్‌ఫోన్ ఇచ్చి లైంగికదాడికి యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బుధవారం కల కలం రేపింది.  అమ్రాబాద్ మండలం మన్ననూర్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం సిద్ధార్థ మహదేవ్ అలియాస్ మద్దెల పర్వతాలు అచ్చంపేటలో నివాసం ఉంటున్నాడు.

అతడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై కన్నేశాడు. సెల్‌ఫోన్ ఇప్పించి చాటుగా మాట్లాడుకుందామంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బుధవారం ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అఘాత్యానికి ప్రయత్నించాడు. యువతి కుటుంబ సభ్యులకు తెలుప డంతో స్థానికులు హెచ్‌ఎంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.