నిర్మల్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని బావాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నక్సలైట్ ఉద్యమాన్ని వదిలి జన స్రవంతిలోకి రావాలని ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు. శుక్రవారం శ్రీనివాస్ తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలుసుకొని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎస్పీ తల్లి ఆరోగ్యం బాగాలేదని కొడుకు తనను బాగా చూసుకోవాలని తల్లి వేడుకుంటుందని తెలిపారు. తల్లి కోసం ఉద్యమం వదిలి జల స్రవంతిలోకి వస్తే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుని చేయూతనందిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా, సిఐ సైదులు ఖానాపూర్ పోలీసులు ఉన్నారు.