calender_icon.png 24 February, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో నిల్వ ఉంచిన పత్తి దగ్ధం

19-02-2025 09:15:25 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల గ్రామంలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన పెండ్లి సంపత్ ఇంట్లో నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సమాచారం అందడంతో బెల్లంపల్లి ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చెదరేగుతున్న మంటలను ఆర్పి వేశారు. ఈ సంఘటనలో రూ 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకున్నారు.