26-04-2025 11:59:47 AM
న్యూఢిల్లలీ: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు(Telangana-Chhattisgarh border) అడువుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవుల్లో వరుసగా ఐదోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లతోనూ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. గుంజపర్లి, నంబి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్(Search operation) కొనసాగుతోంది. పూజారికాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్ట అడవుల సమీప గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
కేంద్ర హోంశాఖ(Central Home Ministry) ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లాలోని కర్రెగుట్ట అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలు, కేంద్ర పారామిలిటరీ యూనిట్లు కర్రెగుట్ట కొండ(Karregutta Hill) ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మర్ అడవులు విస్తృత శోధన కార్యకలాపాల కేంద్రంగా మారాయి. భద్రతా సిబ్బంది దట్టమైన అడవి గుండా గాలిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర దళాలు గతంలో ప్రవేశించలేని ప్రాంతాలపై తమ పట్టును పెంచుకుంటున్నందున, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలపై వారి పట్టు క్రమంగా బలహీనపడుతోందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఆపరేషన్లు కొనసాగుతున్నందున పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.