calender_icon.png 11 January, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండె శబ్దాలను కలిపి!

15-09-2024 12:00:00 AM

విజ్ఞాన శాస్త్ర నియమాలకు తమ అంతుచిక్కని ఆలోచన రంగవల్లులను జత చేసి జాతి జాగృతి ప్రకాశం కోసమై విశ్వాంతరాళంలో మానవ మనుగడ ఉనికికి ఊపిరిపోయడమే ధ్యేయమై సాంకేతికతకు తమ ప్రాణంతో పరుగులు పెట్టిస్తారు..!

అవని మొదలుకొని అంతరిక్షపు గెలాక్సీల దాకా ఇంజినీర్ల జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం! 

జ్ఞానంతో చేసే ఓ నిరంతర రణం!

వారి త్యాగానికి ప్రతిరూపమై ఏమిచ్చినా తీర్చుకోలేము ఇంజినీర్ల రుణం!

మంగళయాన్, చంద్రయాన్ విజయ కేతనాల సాక్షిగా నా జాతీయ జెండా సగర్వంగా తల ఎత్తుకొని ఎగరడానికి అహర్నిశలు అన్నీ మరచి తన అనుకున్న వాళ్ళనందరినీ వదిలి ఇస్రోనే తమ దేవాలయంగా భావించి శాస్త్ర విజ్ఞానాన్ని మాత్రమే శ్వాసిస్తున్న ఇంజినీర్ల అంకితభావానికి గర్వపడుతున్న!

పరికరాలకు తమ పట్టుదలను జోడిస్తూ సంకల్పబలంతో వాటికి ప్రాణం పోస్తూ భవిష్యత్ ప్రాజెక్టులుగా పరిచయం చేస్తూ రాకెట్ల వేగానికి తమ గుండె శబ్దాలను కలిపి

తమ సృజనతో కాంతివేగంతో కదిలి అంతరిక్షపు సరిహద్దులను చెరిపేస్తుంటే అక్షరం అక్షరం అభ్యుదయమై కదిలే కవి కలం వేదికగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

వంటి భారతరత్నాల స్ఫూర్తికి.. పాదాభివందనం చేస్తున్నా!

రహదారులతో ఓ దారిని చూపుతూ నాగరికత పరిణామం మారుస్తూ అనంత విశ్వాన్ని అరచేతుల్లో బంధిస్తూ కాగితాలపై బొమ్మలు గీస్తూ కంప్యూటర్‌లో దానికి జీవం పోస్తున్న ఇంజినీర్ల దేశభక్తికి ఇంజినీర్లే మన దేశ శక్తి అని మీకందరికీ సవినయంగా తెలియజేస్తున్నా!!