* జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి అందాలకు నిలయంగా కలర్స్ థీమ్ పార్క్ నిలుస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మల్లాపూర్, కాప్రా సర్కిల్ 1, 2వ వార్డులో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.2.94 కోట్లతో నిర్మించిన కలర్స్ థీమ్‌పార్క్‌ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతశ్రీలతరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మిమాట్లాడుతూ థీమ్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్, ప్లే కోర్ట్, సెల్ఫీస్టాల్, పిల్లల ఆటస్థలం లాంటివి అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. ఈ పార్క్‌లో 107 రకాల మొక్కలు ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగాషెడ్, స్కేటింగ్‌రింగ్‌లు పెద్దలు, పిల్లలకు ఉపయోగపడుతాయన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆహ్లాద కేంద్రంగా ఈ పార్క్ నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కార్పొరేటర్లు వన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.