calender_icon.png 25 March, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు

23-03-2025 05:58:13 PM

లక్షేటిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 15వ వార్డు (అంకతి వాడ)లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కారించాలని కోరుతు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు మాట్లాడుతూ... లక్షేటిపేట మున్సిపాలిటి ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమని, అధికారులకు పన్నులు వసులు చేయండంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి చేయడంలో లేదని అన్నారు. గత పాలకులు సైతం అభివృద్ధి చేశామని మాటలు చెప్పుకోవడం తప్ప వారు తమ కాలానికి చేసిందేమీ లేదని అన్నారు. తమ కాలనీలలో ఇప్పటివరకు మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు లేక 14సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

తమ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందని, అలాగే రోడ్డు వ్యవస్థ కూడా బాగుపరచాలని గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులకు, నాయకులకు విన్నవించుకున్న తమను పట్టించుకునే నాథుడే లేరనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో 30 కుటుంబాల వరకు ఉంటాయని వారంతా ఇదే సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏప్రిల్ మొదటి వారంలోనే పనులు ప్రారంభించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, పింగిలి వేణుగోపాల్, కాండ్రపు శ్రీనివాస్, ఇండ్ల మల్లేష్, నస్పూరి తిరుపతి, పనాస లచ్చన్న, పెట్టెం సత్యం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.