calender_icon.png 25 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం కాలనీవాసుల అవస్థలు

24-03-2025 12:43:17 AM

మహబూబాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి): మూడు నెలలుగా అరకొరగా జరుగుతున్న తాగునీటి సరఫరాతో  కాలనీవాసు లు అవస్థలు పడుతున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలోని బర్ల పెంట బజార్ కాలనీ వాసులు నీటి సమస్యతో కొనసాగుతున్నారు.

కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక  వాటర్ మెన్లకు తెలియజేసిన చర్యలు తీసుకోకపోవడం పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు వాడుకునే నీళ్లు ఇటు తాగే నీళ్లు ట్యాం కర్లతోని తెప్పించుకొని వాడుకొనే పరిస్థితి ఏర్పడిందని ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే తమకు నీటి కష్టాలు మొదలయ్యాయి అని కాలనీవాసులు గగ్గోలు పెడు తున్నారు. 

మూడు నెలల నుంచి బోరింగ్ చేతి పంపుతో నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నామని తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు నీటి సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.