పటాన్ చెరు, ఫిబ్రవరి 4 : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని అయిదవ వార్డు ఐడీఏ కాలనీలో ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు. కాగా మంగళవారం మిషన్ భగీరథ పైపులైన్ కోసం సీసీ రోడ్డును తవ్వేందుకు జేసీబీ రావడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు.
దీంతో జేసీబీ వెనుతిరిగి పోయింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలి వేస్తుండంటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.