calender_icon.png 7 November, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

07-11-2024 03:14:01 PM

కాప్రా (విజయక్రాంతి): కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ కాలనీ ఫేస్ 2 కాలనీ సంక్షేమ సంఘం నాయకులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలో సిసి రోడ్లు పనులు చేపట్టడంతో పాటు వీధి దీపాల నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగిళ్ల బాల్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు దాసరి కనకయ్య ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ శివకుమార్, కోశాధికారి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు నరేష్, బాల్రాజ్, మాజీ అధ్యక్షులు తాటికంటి సంపత్ ఉపేందర్ తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.