29-03-2025 12:54:11 AM
భద్రాచలం,(విజయక్రాంతి): వలస వాదులకు అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో ఏజెన్సీ చట్టాలకు తూట్లు పడుతున్నాయని, కుప్ప కూలిన బహుళ అంతస్తుల భవనం ఘటనలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా గౌరవాధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక లంబాడీ కాలనీ నందు ఆరంతస్తుల అక్రమ కట్టడం కుప్పకూలి మృతి చెందిన మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భద్రాచలం ఒక ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ బహుళ అంతస్తులను ఎన్నో ఏళ్ల నుంచి ఉండే స్థానికులు కాకుండా ఇక్కడ అత్యధిక చట్టాలు కలిగిన గిరిజనులు కాకుండా వలసవాదులు వేరే ప్రాంతం నుంచి వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కొంత మంది రాజకీయ నాయకుల అండతో గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజన హక్కులను హరిస్తూ న్నారని ధ్వజమెత్తారు.భద్రాచలంలో వీరికి బహుళ అంతస్తులకు ఏ విధంగా అనుమతులు , లైసెన్సులు వస్తున్నాయో ఉన్నత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ., వలసవాదులకు అభయమిస్తూ వారికి కావలసిన ధ్రువపత్రాలను రెవెన్యూ కార్యాలయంలో పంచాయతీ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో ధనబలం ఉపయోగిస్తూ కార్యాలయాల్లో ఉండే అవినీతి అధికారులకు చేతులు తడుపుతూ ఈ వలసవాదులు వారికి కావలసినటువంటి ధ్రువపత్రాలను సంపాదించుకుంటున్నాన్నారు. గత రెండు రోజుల క్రితం నాసిరకంతో నిర్మించిన అక్రమ బహుళ అంతస్తుల బిల్లింగ్ కూలటం అందులో అమాయక బహుళ కార్మికులు మృతి చెందడం కేవలం అధికారుల వైఫల్యం , లంచగొండితనం వలన మాత్రమే జరుగుతుందని దుయ్యబట్టారు.
భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో, ఐ టి డి ఏ పిఓ సంబందించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వం ద్వారా మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జిల్లా నాయకులు దేపంగి రమణయ్య మాదిగ, ఇసంపల్లి కృష్ణ మాదిగ, అలవాల పెరియార్ రాజా మాదిగ, బోయిల్ల వెంకటేశ్వర్లు మాదిగ, చెంగల గురునాథ మాదిగ, కొప్పుల తిరుపతి మాదిగ, కొలికపాక కాంతారావు మాదిగ, మిరియాల వెంకటేశ్వర్లు మాదిగ, ఇసుకల కొండయ్య మాదిగ, చెక్క రమేష్ మాదిగ, కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, ఈశ్వరయ్య, మేడ్చల్ లక్ష్మణ్, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు చిట్యాల రజిత మాదిగ, జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి మాదిగ, మండల అధ్యక్షురాలు గుండె సుహాసిని మాదిగ, నరేష్, ప్రభాకర్, ఏసు, పుష్ప రాజ్ తదితరులు పాల్గొన్నారు