07-02-2025 01:30:14 AM
రాష్ర్ట పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 6:- మిలర్లతో అధికారులు కుమ్మక్కుతై చర్యలు తప్పవని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ సూచించారు. గురువారం మధ్యాహ్నం యాసంగి పంటల దిగుబడి అంచనా, కొనుగోలు, సి.యం.ఆర్ ధాన్యం పై అదనపు కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లు అధికారులు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
యాసంగీ సీజన్ లో సైతం వరి సాగు భారీగా జరుగుతుందని, ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే సజావుగా పూర్తి చేయవచ్చన్నారు. హార్వెస్టర్లను ముందుగానే పిలిపించి ఒక సమావేశం నిర్వహించాలని,వరి కోతలు చేసేటప్పుడు 18-20 ఆర్.పి యం తో కోతలు చేయాలని,తద్వారా తాలు,చెత్త లేకుండా నాణ్యమైన గింజలు పొందవచ్చన్నారు..
ధాన్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్ల పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డి.యం జగన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.