calender_icon.png 17 October, 2024 | 7:53 AM

ఇంకా తెరుచుకోని కాలేజీలు

17-10-2024 03:39:35 AM

నేటి నుంచి ఫార్మసీ కాలేజీలూ బంద్

హైదరాబాద్, అక్టోబర్16(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవే ట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘాలు తలపెట్టిన కాలేజీల బంద్ బుధవారం కూడా కొనసాగింది. వీరికి ప్రొఫెషనల్ కోర్సునందించే కాలేజీ యాజమాన్యాలు సైతం మద్ద తు తెలుపుతున్నాయి. గురువారం నుంచి ఫార్మసీ కళాశాలల్లో క్లాసులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.   

వారం తర్వాత నిరవధిక బంద్‌కు వెళ్తామని ఫార్మసీ కాలేజీ యాజమా న్యాలు తెలిపాయి. అలాగే బంద్‌కు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం కూడా సంఘీభావాన్ని తెలిపింది. ఇంటర్ స్కాలర్‌షిప్స్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్ని రాజకీయ, విద్యార్థి సంఘాల మద్దతును యాజమాన్యాలు కూడగడుతున్నాయి. ఇందులో భాగంగా  బుధవా రం తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.