యూజీసీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపులో రాష్ట్రంలోని కాలేజీల సంఖ్య తక్కువగా ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల వెల్లడించిన వివరా ల ప్రకారం రాష్ట్రంలో 2,080 కాలేజీలుంటే అందులో 261 కాలేజీలే న్యాక్ గుర్తింపు దక్కించుకున్నాయి. వీటిలోనూ 90 వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నట్లు యూజీసీ తెలిపింది. రాష్ట్రం లో 31 యూనివర్సిటీలుంటే అందులో 11 మాత్రమే న్యాక్ గుర్తింపు పొందాయి. న్యాక్ గుర్తింపు విషయంలో చాలా కాలేజీలు వెనుకంజలో ఉన్నాయి.