calender_icon.png 4 October, 2024 | 8:50 AM

దసరా తర్వాత కాలేజీలు బంద్!

04-10-2024 01:10:19 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం

కాలేజీలు నడుపలేమంటున్న యాజమాన్యాలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి): దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పెట్టే యోచనలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మెనేజ్ మెంట్ అసోసియేషన్ ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ.5,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.1,200 కోట్లకు ఇప్ప టికే ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది.

అందులో దాదాపు రూ.650 కోట్లు డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీలకు చెల్లించాల్సినవి ఉన్నాయి. వీటిని దసారాలోపు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా సిబ్బందికి వేతనాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తేనే కాలేజీల మనుగడ సాధ్యమని అసోసియేషన్ అధ్యక్షుడు బీ సూర్యనారాయణరెడ్డి అన్నారు. టోకెన్లు ఇచ్చి దాదాపు ఏడాది కావొస్తుందని తెలిపారు. తమ గోడు ను పలువురు మంత్రుల వద్ద వెళ్లబోసుకోగా.. ప్రభుత్వం వద్ద ఇప్పుడు నిధులు ఎక్కడివి? అని తేలిగ్గా తీసుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.