14-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : ఖమ్మంలో గురువారం పలు ప్రాంతాల్లో కాలేజ్ అమ్మాయిలు పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘స్కూటీ గ్యారంటీ’ ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన యువతులకు ఉచిత స్కూటీ అందిస్తామని హామీ ఇచ్చింది.
అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఈ హామీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో కాలేజ్ అమ్మాయిలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ప్రధాన పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యార్థినులు పోస్ట్‌కార్డులు పంపిస్తూ, తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.