calender_icon.png 26 April, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలి

25-04-2025 08:41:47 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ పట్టణంలో వ్యవసాయ కళాశాల మంజూరుకు కృషి చేయాలని శుక్రవారం రైడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, కోశాధికారి చిదుర మహిపాల్, ప్రధాన కార్యదర్శి శేఖర్, సలహాదారులు బెజగం వెంకటేశం, కేవీ మోహన్, నాయకులు పత్తి రాము, సంజీవరెడ్డి, నాగేందర్ పాల్గొన్నారు.