25-03-2025 04:43:18 PM
ఘనంగా మైనింగ్ మూమెంట్స్-25..
ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్, సింగరేణి జీఎం(క్వాలిటీ) కన్నకయ్య..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రతీ విద్యార్థి జీవితంలో కాలేజీ రోజులు ఒక మధురమైన జ్ఞాపకాలని కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి జగన్మోహన్ రావు, సింగరేణి జిఎం (క్వాలిటీ) కన్నకయ్యలు అన్నారు. మంగళవారం కేఎస్ఏం కళాశాల మైనింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో "మైనింగ్ మూమెంట్స్-25" పేరుతో ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి జిఎం (క్వాలిటీ) కన్నకయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ టి జగన్మోహన్ రావు హాజరై ప్రసంగించారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువుల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఇంజనీరింగ్ విద్యార్థి దశలో ఈ నాలుగేళ్ల విలువైన సమయాన్ని నేర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్నవే భవిష్యత్తులో ఉద్యోగాలు చేసే సమయంలో పనికొస్తాయన్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాలను వీడి వెళ్లిపోతున్నామని బాధలో కొందరు విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడికి వెళ్లినా... ఏ రంగంలో స్థిరపడినా... మళ్లీ అందరం కలుసుకోవాలని విద్యార్థులందరూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవి కిరణ్, డి.కోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.