26-03-2025 01:32:34 AM
మేడ్చల్, మార్చి 25(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం మంగళవారం కూకట్పల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బృందావన్ కాలనీలోని కుతుబుల్లాపూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. కెపిహెచ్బి నాలుగో పేస్ లో బస్తీ దవఖానాను తనిఖీ చేశారు. బస్తీ దవఖానాలో అందుతున్న సేవలను వివరించి ఓపి పెరిగేలా చూడాలన్నారు. రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మందులు ఇచ్చిన రికార్డులు సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బాలాజీ నగర్ బస్తీ దవఖాన తనిఖీ చేశారు. ప్రతిరోజు ఓపి నమోదును , అందుతున్న సేవలను ప్రతిరోజు తనకు నివేదిక పంపాలని డిఎం హెచ్ ఓ కు సూచించారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్వో డాక్టర్ సి ఉమా గౌరీ, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, తహసిల్దార్ స్వామి ఉన్నారు.