calender_icon.png 4 January, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో కలెక్టర్ కొత్త సంవత్సర వేడుకలు

01-01-2025 11:08:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించుకొన్నారు. 2024కు స్వస్తి పలుకుతూ 2025 సంవత్సరంకు స్వాగతం పలుకుతూ ప్రజలు, ఉద్యోగులు, యువకులు, అధికారులు, విద్యార్థులు అర్ధరాత్రి నుండి హ్యపి న్యూ ఈయర్ అంటు కేరింతలు కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు కలెక్టర్‌కు కొత్త సంవత్సరం శుబాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు సాగరిక విద్యార్థులు ఉన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిలకు పోలీసులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.