calender_icon.png 4 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

02-04-2025 12:00:00 AM

భద్రాచలం, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): భద్రాచలం రామాలయం లో శ్రీ రామ నవమి ఉత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం పై ఆలయ అధికారులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల ఆరో తేదీన సీతారాముల కళ్యాణం , ఏడవ తేదీన మహా పట్టాభిషేకం జరగనున్నాయి.కళ్యాణ పనుల ఆలస్యంపై , వీవిఐపీల ప్లేస్ సర్దుబాటు జాప్యం పట్ల ఆలయ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ చేశారంటూ ఆలయ ఈవో రమాదేవి , ఈ ఈ రవీంద్ర రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ , ముఖ్యమంత్రి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ మండిపడ్డ కలెక్టర్ జీతేష్ వి పాటిల్.భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అలాగే నవమి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నందున ప్రోటోకాల్ ఎక్కువ ఉండే పరిస్థితి కనుక అధికారులు ఏర్పాట్ల పై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు