యాదాద్రి భువనగిరి, జూలై 5 (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పిలుపు మేరకు శుక్రవారం భువన గిరిలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బీజేవైఎం ఆందోళన పిలు పు మేరకు పోలీసులు ముందస్తు అరెస్టు లు చేసినప్పటికీ రెండు జట్లుగా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు భువనగిరి కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి తుర్కపల్లి, బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా ఆందోళనకా రులు, పోలీసుల మధ్య జరిగిన తోపులా ట స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రూపు మెయిన్స్‌కు 1:100 మందిని ఎంపిక చేయాలని, గ్రూప్ పోస్టుల ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, బీజేవైఎం నాయకులు భాస్కర్‌గౌడ్, మణిగౌడ్, కుమార స్వామి, గణేష్, సదానందం, సైదులు తదితరులు పాల్గొన్నారు.