నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 10 గంటలకు గురుకుల పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనాలు చేసి తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మండల అధికారులు ఉన్నారు.