ఇల్లందు: మండల కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టేకులపల్లి తాసిల్దార్ నాగ భవాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.