అంగన్వాడీ టీచర్లు ఓటరు జాబితా సర్వే వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శనివారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు జాబితా ఇంటింటి సర్వేను పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు జాబితా సమగ్ర సర్వే జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
పట్టణంలోని 86 బూతు నెంబర్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సర్వే పై అంగన్వాడి టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్ స్వరూపను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటర్ జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమంది ఇళ్ళల్లో సర్వే పూర్తి చేశారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని యువ సంఘటన్ పాఠశాలలో పోలింగ్ బూత్ లను కలెక్టర్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఓటరు జాబితా సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.