- ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
దరఖాస్తు చేసుకున్న 5 వేల మంది నిరుద్యోగులు
నియామకాల కోసం 8 నెలలుగా ఎదురుచూపు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగుల జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. కలెక్టర్‌గా జితేష్ వీ పాటిల్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 5,200 మంది దరఖాస్తు చేశారు.
ఎనిమిది నెలలవుతున్నా ఆ దరఖాస్తులకు సంబంధించి, నియామకాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నిరూత్సాహపడుతున్నారు. ఉద్యోగాలు కల్పించనప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులులు ఎందుకు చేపట్టారని అధికారులను నిలదీస్తున్నారు.
గత ఏడాది జున్ 16న ప్రకటన
గత ఏడాది జున్ 16వ తేదీన కొత్తగూడెం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను అప్పటి ఉపాధి కల్పనా అధికారి విజేత ప్రకటన జారీ చేశారు. మొత్తం 23 విభాగాల్లో 155 మందిని భర్తీ చేయడానికి జూన్ 18 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
బక్ బేరర్ స్టెనో/డేటా ఎంట్రీ ఆపరేటర్ బ్లడ్ బ్యాంక్ టెక్నిషియన్ కోడింగ్ క్లర్క్స డ్రైవర్ 4, ఎలక్ట్రీషన్ ప్లంబర్ మాలిఇ/సబ్ స్టాఫ్/మనిఫోల్డ్ సూపర్‌వైజర్ టైలర్ టెటిఫోన్ ఆపరేటర్ 8, ధియోటర్ ఆసిస్టెంట్ 10, వ్యాన్ డ్రైవర్ కార్పెంటర్ అటెండర్ బార్బర్ దప్తరి/సబ్ ఆర్డీనేట్ స్టాఫ్( సెంట్రల్‌లైబ్రరీ) డార్క్ రూం అసిస్టెంట్/ డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ దోబి , ల్యాబ్ అటెండెంట్ మేల్ నర్సింగ్ ఆర్డీర్లీ ఆఫీస్ సబార్డీనేట్ రికార్డు క్లర్క్/రికార్డు అసిస్టెంట్ /స్టోర్ కీపర్ వార్డు బాయ్ మొత్తం 155 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.
గంపెడాశతో నిరుద్యోగులు జాతరా తరలి వచ్చి దరఖాస్తు చేసుకొన్నారు. అదే నెల 27 నుంచి దరఖాస్తుల పరిశీలన చేసి అర్హులైన వారికి ఉద్యోగాలిస్తామన్నారు. సుమారు 5,200 మంది దరఖాస్తు చేశారు. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా చేసిన దరఖాస్తులు ఏమయ్యాయో, ఇస్తానన్న ఉద్యోగాలు ఎటు పోయాయో అని నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు చేసిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేకుండా పోయింది. వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్టు తెలుస్తున్నది. కలెక్టర్ ఉద్యోగాల విషయాన్ని మళ్లీ ఏనాడు కూడా ప్రస్తావించకపోవడం శోచనీయం.