మహాబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(Social Welfare Department Girls' Residential Degree College)ను రాత్రి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పి జానకి, వివిధ శాఖల మహిళా అధికారులు సందర్శించారు. విద్యార్థినులతో కలిసి రాత్రి భోజనం చేశారు. భోజనం తర్వాత స్టోర్ రూం, కిచెన్, కూరగాయలు భద్రపరిచే రూంను సందర్శించారు.
మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలన్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు అందించేలా కాంట్రాక్టర్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు బి.సి సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం, భూగర్బ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి కౌసర్ జహాన్, మార్కెటింగ్ అధికారిణి బాల మణి, ప్రిన్సిపాల్ జయప్రద తదితరులు కూడా రాత్రి విద్యార్థినిలతో భోజనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కళాశాలలో విద్యార్థినులతో రాత్రి బస చేశారు.