calender_icon.png 17 April, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

08-04-2025 06:57:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా  కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.