01-03-2025 05:48:06 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో గల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పిజియన్ బాక్స్ లను, సీసీ కెమెరాలని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఈనెల 3 నుండి జరగబోయే కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ 14 టేబుల్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సందర్శనలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు.