05-03-2025 07:07:11 PM
అవసరమైన సదుపాయాలు అన్ని కల్పిస్తాం..
చిన్నారుల సంతోషంలో మీ బిడ్డలను చూడండి..
శిశుగృహను సందర్శించిన కలెక్టర్ విజయేంద్ర బోయి..
మహబూబ్ నగర్: శిశు గృహలోని చిన్నారులను సొంత మీ బిడ్డల చూసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. స్టేట్ హోం ఆవరణలోని శిశుగృహను మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... శిశుగృహ చిన్నారులను ఆహ్లదకర వాతావరణంలో పెంచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శిశుగృహలో వేస్తున్న పెయింటింగ్, చిన్నారుల కోసం నూతనంగా నిర్మిస్తున్న పార్కు, ఆట వస్తువులను పరిశీలించారు.
ఈ శిశు గృహ చిన్నారులకు ఉపయోగపడేలా చిత్రాలు వేయాలని సూచించారు. ప్రతిరోజు పిల్లలని పార్కులో ఆడించాలని తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగంగా నాణ్యవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యుఓ జరీనా బేగం, సిడిపిఓ శైలజ శ్రీ, డిసిపి ఓ నర్మద, తదితరులు పాల్గొన్నారు.