calender_icon.png 2 November, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

30-08-2024 04:20:15 PM

 జడ్చర్ల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి  

మహబూబ్​నగర్: రోగులకు సరైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం ఆమె జడ్చర్ల ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె ఓపి విభాగాన్ని సందర్శించి శుక్రవారం ఎంతమంది చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి సూపరింటిండెంట్  చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. కాగా శుక్రవారం 510 మంది అవుట్ పేషెంట్లు  ఆసుపత్రికి వచ్చారని సూపరింటిండెంట్  తెలుపగా,  కొంతమంది రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని..? ఏమయ్యిందని..?  అడిగి తెలుసుకున్నారు.

జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడుతూ ఎప్పటినుండి జ్వరం వస్తున్నదని? ఇప్పుడు ఎలా ఉందని? అడిగారు. గ్రామాలు నుండి జ్వరాల కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఏలాంటి  వయస్సు వారికి జ్వారాలు వస్తున్నాయ అని ? డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు.  ఓపితోపాటు, మహిళ, పురుషుల వార్డులు, క్యాజువాలిటీ, చిన్నపిల్లల విభాగం, డయాలసిస్ విభాగాలను పరిశీలించి ఆయా వార్డులలో రోగులతో మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో బోర్ నీళ్లు సరిగా రావడం లేదని ,మిషన్ భగీరథ నీరు కావాలని కోరగా, తక్షణమే  మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రితో లోని వార్డులతో పాటు, పరిసరాలను  శుభ్రంగా ఉంచాలని,శానిటరీ సూపర్వైజర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో ఎంతమంది పారిశుధ్య కార్మికులు ఉన్నారని ?ఎన్ని షిఫ్టులు పనిచేస్తున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆర్ ఎం ఓ హరినాథ్, డాక్టర్ ఆసదుల్లా తదితరులు ఉన్నారు