calender_icon.png 20 September, 2024 | 9:36 PM

భోజనంలో సాంబార్ కంటే మరేమీ బాగుండదా ?

20-09-2024 07:50:22 PM

-నిబంధనలను మేరకు విద్యార్థులకు భోజనం అందించాల్సిందే 

-అంగన్వాడి కేంద్రాల్లో సూపర్ హీరోల పర్యవేక్షణ బాలేదు 

-ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్‌ నగర్,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజనం అంటే సాంబార్ తో నే కాకుండా మరే ఇతర కూరగాయలతో వండిన కూర బాగుండదాని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులను, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గండీడ్ మండలంలోని వెన్నచెడ్ గ్రామంలో బాలికల, బాలుర పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాలలోని మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. భోజనానికి సంబంధించి కూరగాయలు అందుబాటులో ఉంచలేదని కేవలం సాంబారు మాత్రమే అత్యధికంగా ఉంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అందించే ఒకపూట భోజనాన్ని సక్రమంగా అందించడం ఎందుకు చేయడం లేదని ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యా బోధన  జరగాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం నిబంధనలు మేరకు అందించాల్సిన బాధ్యత వర్కర్లపై పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. మరోసారి ఇలా చేస్తే జరిగితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ లేదని అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వహణ ఉండాలని చిన్నారులకు గర్భిణీ బాలింతలకు పోస్టుకాహారం సమృద్ధిగా అందించాలని ఆదేశించారు. అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిన్నపిల్లల పోషణ అంగన్వాడి కేంద్రంలో సక్రమంగా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ ఉండాలని నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిందర్ రెడ్డి, చిన్న పులేందర్ రెడ్డి, అధికారులు, గ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.