09-04-2025 12:51:48 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) : పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయిఅన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూర్ గ్రామం ఎస్.సి.కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు హెచ్.గోపాల్, భార్యసత్తమ్మల ఇంట్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్న బియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి. వెంకటేష్,జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.ఎం.రవి నాయక్,తహశీల్దార్ సుందర్ రాజ్,ఎం.పి.డి. ఓ కరుణశ్రీ, సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.