calender_icon.png 12 March, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

12-03-2025 06:20:46 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా వద్దగల డబ్ల్యూటీపి(WTP)ని సందర్శించి మిషన్ భగీరథ ఈఈ రాకేష్(Mission Bhagiratha EE Rakesh) ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి భగీరథ నీరు(Bhagiratha Water) అందేలా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలను గుర్తించడంతోపాటు వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రానున్న వేసవిలో అనుసరించాల్సిన విధానానికి సంబంధించి కిందిస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఏది ఏమైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత భగీరథ అధికారులపై ఉందని తెలిపారు. వేసవి దృష్ట్యా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మిషన్ భగీరథ ఈఈ రాకేష్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.