05-04-2025 04:01:30 PM
రేషన్ బియ్యంతో భోజనం చేసిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే
వంటలపై సంతృప్తి వ్యక్తం
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఓ దళితుడి ఇంటికి అతిథిగా వెళ్లి ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తున్న సన్న బియ్యం తో వండిన భోజనాన్ని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి డేవిడ్ ఆర్డిఓ లోకేశ్వర్ రావు తో కలిసి భోజనం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీకి చెందిన శంకర్ అనే దళిత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతుందన్నారు.