calender_icon.png 23 March, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలి

22-03-2025 07:57:42 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో నీటి సరఫరా ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారి(Additional Collector Deepak Tiwari), డిపిఓ బిక్షపతి, మిషన్ భగీరథ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్యలు లేకుండా ముందస్తు కార్యాచరణతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటికి మీరు అందుతున్న సమయం, రోజు వివరాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడైనా పథకం సంబంధిత పైప్ లైన్లు లీకేజీ ఉన్నట్లయితే వెంటనే మరమ్మత్తులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా మిషన్ భగీరథ పథకం(Mission Bhagiratha Scheme) ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటి నమూనాను పరిశీలించి పథకం ద్వారా ప్రతి గ్రామానికి సిద్ధమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా బావులు, బోరు బావులలో నీరు అడుగంటి పోయే అవకాశం ఉన్నందున ప్రజలు మిషన్ భగీరథ నీటిని వినియోగించుకోవాలన్నారు.

పథకం ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు, ఇబ్బందులు లేకుండా నీటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బావులు, బోరుబావు లలో నీరు ఇంకినట్లయితే ట్యాంకర్లు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని ఓ. హెచ్. ఆర్. ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, గ్రామంలో ఎవరైనా మరుగుదొడ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, మిషన్ భగీరథ ఇంజనీర్లు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.