calender_icon.png 19 January, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందించాలి

19-01-2025 06:22:57 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా(Rythu Bharosa), కొత్త రేషన్ కార్డులు(New Ration Card), ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa) పథకాల ఫలాలు జిల్లాలోని అర్హులందరికీ అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. ఆదివారం  కాగజ్ నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా(Sub-Collector Shraddha Shukla)తో కలిసి కాగజ్ నగర్ డివిజన్ తహసిల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం లో భాగంగా జిల్లాలో వ్యవసాయ సాగుకు యోగ్యం గల ప్రతి రైతుకు పథకం అందించాలని, సాగుకు యోగ్యం కానీ రాళ్లు, గుట్టలు, నివాస గృహాలు, వెంచర్లు, లే అవుట్లు, అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములు, ఇరిగేషన్ భూములు, చెరువులు, కాలువలు, రహదారులు, రైల్వే లైన్ల కోసం కేటాయించిన భూములను రైతు భరోసా జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా రూపొందించాలని తెలిపారు. అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, అధిక ఆదాయం కలిగి అర్హత లేనివారికి రేషన్ కార్డు జారీ చేయకూడదని తెలిపారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలను గ్రామసభలలో చదివి వినిపించాలని తెలిపారు. అర్హత గలవారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పథకాల వారీగా అధికారులను నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కాగజ్ నగర్ మండలంలోని ఎన్జీవోస్ కాలనీలో రేషన్ కార్డుల ఎంక్వైరీ తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.