... జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బిర్సా ముండా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనంలోనీ సమావేశ మందిరంలో బిర్సా ముండా 150 వ జయంతి పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవల్ , ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, శిశు సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ తో కలిసి మొదట జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలు వేసిన అర్పించారు.
బీహార్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని గుర్తు చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం ఈ ప్రాంతంలో కొమురం భీం పోరాట స్ఫూర్తి ఉంది అన్నారు. గిరిజనుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గుస్సాడి కళను ప్రపంచానికి చాటిన పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయులు కనకరాజును కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయాలు గుర్తుండి పోయేలా కనకరాజు కృషి ఉందని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలిపారు. గిరిజన సాధికారత వికాసిత భారత్ లో భాగంగా జన జాతీయ గ్రామ ఉత్కర్స్ అభియాన్ పథకంలో గిరిజన సంక్షేమం కోసం సంకల్పంతో ఆచరణ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.
జిల్లాలో 102 గిరిజన గ్రామాలలో ఈ పథకం అమలవుతుందని తెలిపారు. పథకంలో ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ పక్క గృహాలు, గృహ విద్యుత్, ఆప్ గ్రిడ్ , నూతన పౌర విద్యుత్ పథకం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన లో రహదారుల నిర్మాణం, జల్ జీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ సికిల్ మిషన్ వ్యాధి ఆధికృత, అవగాహన కేంద్రాలు ఏర్పాటు, సమగ్ర శిక్షణ అభియాన్ వసతి గృహాలు, అంగన్వాడి సేవలు టెలికాం సాంకేతిక అభివృద్ధి ఇలా 20 అంశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, అంగన్వాడీలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్తులు పాల్గొన్నారు.