జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
రెవిన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): జిల్లాలో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో రెవెన్యూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో 3.51 లక్షల ఎకరాల లో పత్తి పంట సాగు జరిగింది అన్నారు. పండించిన పత్తి పంటను ఏ ఇ ఓ లు తప్పనిసరిగా క్రాఫ్ బుకింగ్ చేయాలన్నారు. వెంటనే జిల్లాలో ఎంపిక చేసిన అన్ని జిన్నింగ్ మిల్లల్లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలి అన్నారు. ఏర్పాటచేసిన ప్రతీసెంటర్లో ఇంటర్ నెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిమ్మింగ్ మిల్లుల వద్ద లారీల పార్కింగ్ ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పత్తి లారీలు త్వరగా ఖాళీ చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి త్వరిత గతిన తరలిం చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, వ్యవసాయ, మార్కెట్ శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ లు చేయాలనీ ఆదేశించారు. జిమ్మింగ్ మిల్లులయాజమాన్యం లారీలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలి. జిన్నింగ్ మిల్లుల ఏరియా సదాశివపేట లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ , మార్కెట్ శాఖ అధికారులుపాల్గొన్నారు.